వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం ఉద్యోగాల పేరుతో భారీ దందా

రిపోర్టర్: వెంకట్ స్థలం: Warangal

ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ బీ రాజారెడ్డి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టుల ఇప్పిస్తామంటూ దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దళారులను నమ్మి ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని, నియామకాలు నిబంధనల ప్రకారమే జరుగుతాయని హెచ్చరించారు. ఉద్యోగిపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర స్థాయి విచారణ జరుగుతోందని, జిల్లాలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదని ఆయన తేల్చిచెప్పారు.