డబ్బు అహంకారంతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదన్న మేయర్ మధుకర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

డబ్బు, అహంకారంతో రాజకీయాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ హెచ్చరించారు. లక్సెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యక్తులు ప్రదర్శిస్తున్న ధన అహంకార ధోరణిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు.