ఓటర్ల తొలగింపుపై కేంద్రం కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: సతీష్ స్థలం: వికారాబాద్

తెలంగాణలో 'SIR' పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీయేతర రాష్ట్రాలను దెబ్బతీసేందుకు కేంద్రం చేస్తున్న అరాచకాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.