స్థానిక ఎన్నికల్లో వేధింపులపై ఎన్నికల కమిషనర్కు సాయి కిషోర్ రెడ్డి ఫిర్యాదు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓబులవారిపల్లి మండల వైకాపా అధ్యక్షుడు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.