ఉద్యోగులను రెచ్చగొడితే ఉపేక్షించేది లేదంటూ మంత్రి స్వామి హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. రెగ్యులరైజేషన్, నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపామని వెల్లడించారు. రాజకీయ లబ్ధికోసం కొందరు ఉద్యోగులను కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అసాంఘిక శక్తులు చొరబడి దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.