తిరుమలలో మిస్సింగ్ వ్యక్తిని గుర్తించిన తిరుపతి జిల్లా క్రైమ్ పోలీసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని క్రైమ్ పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సుమారు ఏడాది క్రితం తమిళనాడులో నమోదైన మిస్సింగ్ కేసుతో ఈ వ్యక్తికి సంబంధం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.