'బలవంతంగా వాహనాలు ఎత్తుకెళ్లే హక్కు లేదు': సుప్రీంకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
ఈఎంఐ బకాయిలు చెల్లించలేదనే కారణంతో రాత్రి సమయంలో దొంగచాటుగా లేదా బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకునే హక్కు ఫైనాన్స్ కంపెనీలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకు చెందిన ట్రక్ యజమాని హరి దత్త శర్మ కేసులో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ వ్యవహరించిన తీరుపై విచారణ జరిపిన కోర్టు, రుణ రికవరీ పేరుతో చట్టవిరుద్ధంగా, బలవంతంగా వాహనాలు ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోన్ డిఫాల్ట్ అయినప్పటికీ ఆర్బీఐ మార్గదర్శకాలు, చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే పాటించాలని తేల్చి చెప్పింది.