కుమారుడి మృతిపై ఐఐటీ బాంబే వద్ద ఆందోళన చేపట్టనున్న తండ్రి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

ఐఐటీ బాంబేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాల్ వాకోడే తండ్రి రవీంద్ర వాకోడే సోమవారం నుండి ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. క్యాంపస్లోకి తమకు ప్రవేశం నిరాకరించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మృతికి సంబంధించిన నిజాలు వెలుగులోకి రావాలని, విద్యార్థులు ఆందోళనలు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్యాంపస్లో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.