శ్రీకాళహస్తి నూతన డీఎస్పీ పావనిని కలిసిన దేవస్థానం చైర్మన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పావనిని దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జయప్రకాష్, కుమార్, గరికపాటి చంద్ర, మాధవ మహేష్ తదితరులు పాల్గొన్నారు.