అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఆకట్టుకున్న పన్నెండు అడుగుల అద్భుత బతుకమ్మ

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్లో టీటీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరు వందలకు పైగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, అరవైకి పైగా బతుకమ్మలను తయారు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పన్నెండు అడుగుల తిరిగే బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలు విజయవంతమయ్యాయని వారు పేర్కొన్నారు.