వైద్యం అందక పసికన్ను మూసిన బిడ్డ కలెక్టర్ ముందు తండ్రి రోదన

రిపోర్టర్: రాము స్థలం: Adilabad

అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఐదు రోజుల పసికందు మృతి చెందింది. ఈ ఘటనపై మృతుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటంతో సరైన వైద్యం అందక తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, తమ కడుపుకోత తీర్చేది ఎవరని ఆ తండ్రి అధికారులను నిలదీసి వాపోయిన హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.