ఆశ్రమ పాఠశాలలో బాలిక గర్భం ఘటనపై ముగ్గురు సస్పెండ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనలో ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం శాంతమతి, వార్డెన్ విజయగంధం, ఉపాధ్యాయురాలు లోవమ్మలను సస్పెండ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వంటమనిషి మంగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.