తునిలో మధ్యాహ్న భోజనం వికటించి పందొమ్మిది మంది విద్యార్థినుల అస్వస్థత

రిపోర్టర్: సునీల్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా తునిలో బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పందొమ్మిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. భోజనంలోని సాంబార్లో బల్లి పడటం వల్లే వారు అనారోగ్యానికి గురైనట్లు విద్యార్థినులు వాపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితులను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.