మధ్యప్రదేశ్ ఎస్ఐ ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగింపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ ఎంప్లాయీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీస్ సబేదార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల రిక్రూట్మెంట్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 23తో ముగియనుంది. మొత్తం 504 ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ esb.mp.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలను అక్టోబర్ 28న నిర్వహించనుండగా, సెప్టెంబర్ 28 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.