వయసుతో సంబంధం లేదు.. లద్దాఖ్ మారథాన్ పూర్తిచేసిన 72 ఏళ్ల వృద్ధుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
విజయవాడకు చెందిన 72 ఏళ్ల మాస్టర్ అథ్లెట్ లింగం రవీంద్రరావు లద్దాఖ్‌లో జరిగిన మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. కేవలం 5:44 గంటల్లోనే 42 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఖార్దుంగ్‌లా ఛాలెంజ్‌కి అర్హత సాధించారు. వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ ఆయన పతకం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.