పంపా రిజర్వాయర్లో విషాదం: గల్లంతైన తండ్రి, ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యమంటూ కలకలం

రిపోర్టర్: నరేష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పంపా రిజర్వాయర్లో గల్లంతైన తండ్రి మరియు ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మోటార్ తెచ్చేందుకు వెళ్లిన పిల్లా నారాయణరావుతో పాటు దుర్గా ప్రసాద్, రాజేష్లు వరద ఉద్ధృతికి గల్లంతు కాగా, గాలింపు చర్యల్లో గురువారం సాయంత్రం వారి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకోగా, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను తుని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.