వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి పెచ్చులు ఊడిపడటంతో తీవ్ర కలకలం రేగింది. ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా కిందపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వార్తలు సేకరించడానికి వెళ్లిన మీడియాను ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఎలాంటి సమాచారం బయటకు రాకుండా ఆసుపత్రి గేటు ముందు భారీగా పోలీసులు మోహరించారు.