మానవ అక్రమ రవాణా కేసులో తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌కు రప్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న మానవ అక్రమ రవాణా కేసులో తొమ్మిది మంది నిందితులకు హైదరాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో జల్ పల్లి మరియు బాలాపూర్ ప్రాంతాలలో దాడులు నిర్వహించి బాధితులను రక్షించిన పోలీసులు, ఎన్ఐఏ విచారణ అనంతరం దోషులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.