వర్షాన్ని లెక్కచేయకుండా వర్ధన్నపేటలో ఘనంగా గణనాథుల నిమజ్జనం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

ఒకవైపు జోరుగా కురుస్తున్న వర్షం.. మరోవైపు 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో హోరెత్తుతున్న పురవీధులు.. వర్ధన్నపేట పట్టణంలో బుధవారం భక్తిపారవశ్యం వెల్లువెత్తింది. నిమజ్జనం వేళ ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ ప్రాంతాలు తడిసి ముద్దయినప్పటికీ, భక్తుల ఉత్సాహం ముందు వాన వెలవెలబోయింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో వీధుల్లోకి తరలివచ్చారు.