టీడీఆర్ పోర్టల్లో ఆధార్ అథెంటికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

టీడీఆర్ ఆన్లైన్ పోర్టల్లో ఆధార్ ఆధారిత గుర్తింపు ధ్రువీకరణను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లతోపాటు పట్టణ ప్రణాళిక అధికారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఈ సేవలను వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగానే ఉంటుందని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.