టీడీపీ గ్లోబల్ ఎన్నారై కమిటీ ప్రమాణ స్వీకారం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

మంగళగిరిలోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. వివిధ దేశాల నుంచి విచ్చేసిన ప్రముఖులు నూతన బాధ్యతలు స్వీకరించారు. డా. పిల్ గురు రాజా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా, పలువురు జాతీయ, అంతర్జాతీయ నాయకులు జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణం చేశారు.