తాటిపూడి పైపులైన్ లీకేజీ సమస్యకు చెక్: రూ.66 కోట్లతో ఐరన్ పైపుల ఏర్పాటు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం నగర ప్రజలకు తాటిపూడి నుంచి తాగునీరందిస్తున్న పీఎస్సీ పైపులైన్ లీకేజీ సమస్యకు త్వరలో తెరపడనుందని పబ్లిక్ హెల్త్ ఏఈ మణికంఠ తెలిపారు. అమృత్ రెండు పాయింట్ సున్నా పథకం కింద అరై ఆరు కోట్ల రూపాయల నిధులతో నూతన డీఐకే ఏడు ఐరన్ పైపులు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ రహదారిని ఆనుకొని పాత దాని పక్క నుంచే ఇరవై మూడు కిలోమీటర్ల మేర ఈ పైపులైన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.