భారీ వర్షాల వేళ విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఉక్కుపాదం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

భారీ వర్షాల సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంగర తహసీల్దార్ పి. రామారావు, సంగం వీఆర్వో రామచంద్రరావు, వంగర వీఆర్ఏ కె. ఉదయ్ కిరణ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర సమయంలో జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.