అజ్మేర్ హై సెక్యూరిటీ జైలు భద్రతలో పిల్లులు: గ్యాంగ్స్టర్ ప్రాణాలు కాపాడిన వైనం
రిపోర్టర్: మహేష్
స్థలం: అజ్మేర్
రాజస్థాన్లోని అజ్మేర్ హై సెక్యూరిటీ జైలులో ఎలుకలను నియంత్రించేందుకు తెచ్చిన పిల్లులు ప్రస్తుతం వినూత్న రీతిలో భద్రతా విధుల్లో భాగమయ్యాయని జైలు సూపరింటెండెంట్ పారస్ జాంగిడ్ వెల్లడించారు. జైలు చుట్టూ అడవి ఉండటంతో గతంలో ఎలుకల బెడద తీవ్రమైందని, వాటిని అరిట్టేందుకు తీసుకొచ్చిన పిల్లులు సంతానోత్పత్తితో సంఖ్య పెంచుకున్నాయని తెలిపారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఖైదీ గదిలోకి వచ్చిన నాగుపామును పిల్లులు గుర్తించి ప్రాణాలు కాపాడాయని అధికారులు పేర్కొన్నారు.