స్థానిక ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లు ఇక ఆన్లైన్లో ఉంచుతామని ఎస్ఈసీ వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మరియు ఆస్తులు తదితర వివరాల అఫిడవిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తమ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసి సాధారణ ఓటర్లు పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. పోలింగ్కు ముందే అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించడం పట్ల హైకోర్టు ధర్మాసనం హర్షం వ్యక్తం చేస్తూ పిటిషన్ను పరిష్కరించింది.