పత్రికా స్వేచ్ఛపై డీడీపీఈ చట్టం ప్రభావం: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ చట్టం పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తోందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ తెలిపారు. ఈ పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. పరిశోధనాత్మక వార్తలు రాసేందుకు ముందస్తు అనుమతి అవసరమైతే న్యూస్రూమ్లు మూతపడతాయని, రహస్య సమాచార వనరులు బయటపడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు.