టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: త్వరలో మార్కెట్లోకి వివో వీ80 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే కొత్తగా వివో వీ80 ఎఫ్ఈ మోడల్ ను మార్కెట్లోకి తీసుకురానుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఫోన్ ఫిలిప్పీన్స్ అధికారిక వెబ్ సైట్ లో ప్రత్యక్షం కావడంతో పాటు థాయ్ ల్యాండ్ ఎన్ బీటీసీ సర్టిఫికేషన్ కూడా పొందిందని టెక్ నిపుణులు తెలిపారు. దీని ద్వారా త్వరలోనే ఈ అద్భుతమైన మొబైల్ ఆసియా మార్కెట్లలో విడుదల కానుందని స్పష్టమవుతోంది.