రాజాపేట: ఐదు లక్షలలోపే నాణ్యమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల పరిషత్ కార్యాలయంలో సాయి మణికంఠ ఇన్ఫ్రా కంపెనీ నిర్వాహకులు ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ప్రదర్శించారు. ప్రభుత్వ మంజూరు చేసిన అయిదు లక్షల రూపాయల లోపే నాలుగు వందల చదరపు అడుగులలో పూర్తి ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాగవేణి, ఏఈ వివేకానంద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టతనిచ్చారు.