బొబ్బిలి పుర ఎన్నికకు సర్వం సిద్ధం: పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
రిపోర్టర్: సునీల్
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పుర ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందజేసి ప్రత్యేక వాహనాలలో తరలించినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అరు జోన్లలో అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగ్గురు వందల మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించామని వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.