మాజీ సర్పంచుల అరెస్టులు అక్రమం: గుంటి మధుసూదన్ రెడ్డి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేటలో మాజీ సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచులను అక్రమంగా నిర్బంధించడం దారుణమని ఆయన ఆరోపించారు.
కాంట్రాక్టర్లకు, సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని, ఇలాంటి పాలనతో ప్రభుత్వానికి శాపం తప్పదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.