బస్టాండ్లలో వరుస చోరీల నిందితురాలు అరెస్ట్: రూ.12 లక్షల నగలు స్వాధీనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: పాయకరావుపేట
మూడు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన మహిళను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు బుధవారం వివరాలు వెల్లడించారు. బస్టాండులో బస్సు ఎక్కుతుండగా బ్యాగులో ఉంచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన జి.నూకపావనిగా నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆమె నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.