సంతరావూరులో రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి భూమిపూజ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా సంతరావూరులో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భూమిపూజ చేశారు. దాతల విరాళం రూ.35 లక్షలు, సీఎజీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి, సామాజిక ఐక్యతకు కేంద్రాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సకాలంలో పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు పాల్గొన్నారు.