చీపురుపల్లి గురుకులంలో శిథిల భవనాల భయం: బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్న విద్యార్థినులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: చీపురుపల్లి

చీపురుపల్లిలోని అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయం శిథిలావస్థకు చేరిందని ప్రధానాచారిణి ఏ.రాణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు వందల మంది విద్యార్థినులు చదువుతున్న ఈ పాఠశాలలో భవనాలు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారాయని ఆమె తెలిపారు. వసతి గృహాలు, తరగతి గదులు శిథిలమవ్వడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.