నైతిక విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ

రిపోర్టర్: రమేష్ స్థలం: కాకినాడ

కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జరిగిన భారతీయం దేశభక్తి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాంకేతికతకు భారతీయ విలువలను జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ ఏడాది లక్షా పది వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని లోకేష్ వెల్లడించారు.