తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు వెలకట్టలేనివని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం అన్నారు. రాజాపేట మండలంలోని రేణికుంటలో చింతలపూరి రామిరెడ్డి విగ్రహానికి, కుర్రారంలో పాశం రామిరెడ్డి స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సాయుధ పోరాటంలో భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.