తమిళనాడులో ఈ నెల 28న మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: తమిళనాడు

తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించే పసిపిల్లలకోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మేనమామ బంగారు ఉంగరం పథకాన్ని ఈ నెల 28న మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. భద్రతా కారణాలరీత్యా ఈ వేదికను ఉసిలంపట్టి నుంచి మదురైకి మార్చగా, తొలి విడతలో ఎంపిక చేసిన 50 మంది నవజాత శిశువులకు ఆయన ఒక గ్రాము బరువుగల బంగారు ఉంగరాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రోత్సహించడంతో పాటు పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ వినూత్న సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.