డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ నేత అబ్దుల్ ఎల్ సయ్యద్ ఫైర్
రిపోర్టర్: సురేష్
స్థలం: మిషిగన్
అమెరికాలోని మిషిగన్ సెనేట్ ఎన్నికల ప్రచార సభలో డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పేరును ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనను సెనేటర్ అని పిలవాల్సి వస్తుందని ఎల్ సయ్యద్ సవాల్ విసిరారు. ఈ పరిణామం అమెరికా రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.