చిన్నారి ఛాతీలో మూడు కేజీల కణితిని తొలగించిన వైద్యులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అహ్మదాబాద్
అహ్మదాబాద్‌కు చెందిన పదకొండేళ్ల చిన్నారిని వేధిస్తున్న ప్రాణాంతక సమస్యకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. గుండె కుడివైపునకు మారడం మరియు ఏకంగా మూడు కేజీల బరువున్న భారీ కణితిని ఛాతీ నుంచి తొలగించడం వైద్యరంగంలో సంచలనంగా మారింది. ప్రముఖ సర్జన్ డాక్టర్ మహేష్ డి.పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం కేవలం మూడు గంటల్లోనే ఈ క్లిష్టమైన సర్జరీని పూర్తి చేసి చిన్నారి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు తెలిపారు.