అనుమతులకు విరుద్ధంగా జరిగే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే సహించేది లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు డెమాలిషన్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.