అన్నాడీఎంకేలోకి సినీ నటుడు ధనుష్ ఎంట్రీ: పార్టీలో తీవ్ర కలకలం

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు తీవ్రమవుతున్న వేళ, సినీ నటుడు ధనుష్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పళనిసామి కుమారుడు మిథున్, ధనుష్ మధ్య ఇప్పటికే మూడుసార్లు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. యువతను ఆకర్షించేందుకు ధనుష్ను పార్టీలోకి తీసుకురావాలని ఈపీఎస్ వ్యూహం రచిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.