గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్: సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
గోదావరి నదిలోకి కలుస్తున్న డ్రైనేజీ వ్యర్థాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నది కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి డ్రైన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. నది స్వచ్ఛతను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సమగ్ర అధ్యయనం చేపట్టనున్నారు.