ఆసియా క్రీడలలో పతకాల జోరు కొనసాగిస్తూ రజతం సాధించిన భారత షూటర్లు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

ఆసియా క్రీడల రెండవ రోజు పోటీలలో భారత్ తన పతకాల ఖాతాను విజయవంతంగా ప్రారంభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో రుద్రంక్ష్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్, పార్థ్ మానే ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో చైనా స్వర్ణం సాధించగా, దక్షిణ కొరియా కాంస్య పతకం గెలుచుకుంది. అలాగే టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో శ్రీజ అకుల, సింద్రేలా దాస్ రాణించి పాకిస్థాన్ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు.