రాష్ట్రంలో కీలక నిర్ణయం: డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను పరిష్కరిస్తూ రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో వందలాది మంది అధికారులకు లబ్ధి చేకూరుతుందని, పాలనాపరమైన విధుల్లో వేగం పుంజుకుంటుందని రెవెన్యూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.