వినాయక నిమజ్జన వేడుకల్లో పదమూడు మంది మృతి చెందారని డీజీపీ వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad / Telangana
తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకల సమయంలో ఒక ఎస్సై సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 26 మంది గాయపడ్డారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా లక్షా 24 వేల విగ్రహాలు ప్రతిష్టించగా, ఇళ్లు మరియు అపార్ట్మెంట్లలో కలిపి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వినాయక విగ్రహాలు కొలువుదీరాయని తెలిపారు. సోమశిల నిమజ్జన వేడుకల్లో కృష్ణానదిలో స్నానం చేస్తుండగా కాలుజారి గల్లంతైన హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన రాజు మృతదేహాన్ని గాలింపు చర్యల ద్వారా పోలీసులు వెలికితీశారని Telugu Scribe పేర్కొన్నారు.