ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కన్నుమూత
రిపోర్టర్: శివ
స్థలం: ఏలూరు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు సీనియర్ రాజకీయ నాయకుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన అందించిన ప్రజా సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.