పుణెలో 21 వేల పానీపూరీలతో అద్భుతమైన గణపతి విగ్రహం ఏర్పాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పుణెలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎఫ్‌సీ రోడ్డులో గణేశ్ భేల్ నిర్వాహకులు ఏకంగా 21,000 పానీపూరీలతో 13 అడుగుల ఎత్తులో వినూత్నమైన గణపతి విగ్రహాన్ని రూపొందించారు. రెండు నెలల పాటు శ్రమించి కళాకారులు ఈ అద్భుత రూపాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ పానీపూరీ గణపతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.