న్యాయాధికారులకు శుభవార్త: పదవీ విరమణ వయసు అరవై రెండు ఏళ్లకు పెంపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును అరవై ఒకటి నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు హైకోర్టు సిఫార్సుల మేరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అర్హులైన న్యాయాధికారులు మరో ఏడాది పాటు తమ విధుల్ లో కొనసాగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.