సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాల జిల్లా
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. 28 ఏళ్లుగా పెరగని కోల్ మైన్స్ పెన్షన్‌ను 50 శాతం పెంచి, కనీస పెన్షన్‌ను రూ.15 వేలకు నిర్ణయించాలని కోరింది. కరువు భత్యాన్ని పెన్షన్‌కు అనుసంధానం చేయాలని, CPRMS వైద్య పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది.
ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి చెల్లిస్తున్న రెండు పెన్షన్లను రద్దు చేయాలని కోరింది. 35 ఏళ్లపాటు సింగరేణికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన పెన్షన్, వైద్య సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఈ నెల 9న నస్పూర్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో సమస్యలపై తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.