రాయచూరులో దారుణం, తీవ్ర గాయాలతో మహిళ మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: రాయచూరు

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పునరావాస శిబిరంలో స్నేహ అనే 25 ఏళ్ల వివాహిత తీవ్ర గాయాలతో పొలంలో పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగా ఆమె కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నారు. మృతురాలి భర్త అమిత్, అతని స్నేహితుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.