సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి అనిత
రిపోర్టర్: సునీల్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజల మధ్యకు వెళ్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ సాధ్యమైన ప్రతి సహాయం అందజేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను బాధితులైన లబ్ధిదారులకు ఆమె స్వయంగా అందజేశారు. ఈ సాయం ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని పేర్కొంటూ, ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా వారి ఇంటి ఆడపడుచులా అండగా నిలుస్తానని మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి స్పష్టం చేశారు.